తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానం దిగే సమయానికి బాంబు బెదిరింపు.. 2 గంటలు తనిఖీలు చేస్తే..

దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఓ విమానంలో బాంబు ఉందన్న సందేశంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రంగంలోకి దిగిన సిబ్బంది.. హుటాహుటిన ప్రయాణికులను ఖాళీ చేయించారు. అనంతరం రెండు గంటలపాటు శ్రమించి.. అది తప్పుడు వార్తగా గుర్తించారు.

bomb rumors in flight
విమానంలో బాంబు బెదిరింపులు

By

Published : Dec 27, 2022, 2:34 PM IST

Updated : Dec 27, 2022, 2:48 PM IST

బాంబు బెదిరింపుతో దిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న స్పైస్​జెట్​ విమానంలో బాంబు ఉందన్న సందేశాన్ని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. 2 గంటల పాటు తనిఖీ చేయగా అది తప్పుడు సందేశం అని తేలింది.

సోమవారం మధ్యాహ్నం 117 మంది ప్రయాణికులతో ఓ స్పైస్​జెట్​ జైసల్మేర్​ నుంచి దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బోర్డింగ్​ సమయంలో ప్రయాణికులు తక్కువగా ఉన్నందున వెనుక సీట్లలో ఎవరూ కూర్చోలేదు. కానీ విమానం దిగే సమయంలో ఓ ప్రయాణికురాలు వెనుకనున్న ఓ సీటుపై.. 'ఈ విమానంలో బాంబు ఉంది' అని హిందీలో రాసి ఉన్న సందేశాన్ని గుర్తించింది. వెంటనే ఈ విషయం సిబ్బందికి తెలిపింది. దీంతో విమానం దిగితున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

వెంటనే రంగంలోని దిగిన భద్రతా దళాలు హుటాహుటిన ప్రయాణికులను ఖాళీ చేయించారు. అనంతరం విమానాన్ని పూర్తిగా స్కాన్​ చేసిన సిబ్బంది.. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధరించారు. ప్రస్తుతం ఈ సందేశం రాసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడినట్లు తెలిపారు. దీనికోసం ప్రయాణికుల అందరి వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీనికోసం సాంకేతిక నిఘాను కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated : Dec 27, 2022, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details