బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని.. మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని గంగూలీ గురువారం వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎంను పరామర్శిస్తానని చెప్పిన దాదా.. ఎప్పుడు ఆమెను కలుస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగ్రామ్‌లో మమత పర్యటిస్తున్న సమయంలో ఆమె గాయపడ్డారు. దీదీ ప్రస్తుతం ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే గవర్నర్ సహా పలువురు నేతలు మమతను పరామర్శించారు.