నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తనను, తన ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపించారు. అనాలోచితంగా సొంతపార్టీపైనే నిందులు వేయడం తగదని హితపు పలికారు. సిద్దూ బహుశా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే ఆలోచనలో ఉంటే నిరభ్యంతరంగా చేరవచ్చని సూచించారు.
సిద్దూ ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియడం లేదన్న అమరీందర్.. రోజూ సొంత ప్రభుత్వాన్నే విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే పాటియాలా నుంచి సిద్దూ పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు.