Shri Ram Pillar Ayodhya :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలోశరవేగంగా రామాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అయోధ్యకు 1200 కి.మీ దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని మౌంటు అబూ నుంచి శ్రీరాముని స్తూపం సోమవారం రామనగరికి చేరుకుంది. ఈ స్తూపానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు అశోక్ సింఘాల్ ఫౌండేషన్ సభ్యులు. మంచి ముహుర్తంలో అయోధ్యలోని మణి పర్వత ప్రాంతంలో ఈ స్తూపాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు.
290 ప్రదేశాల్లోశ్రీరామునిస్తూపాలు
దేశవ్యాప్తంగా శ్రీరాముడు నడయాడిన 290 ప్రదేశాల్లో శ్రీరామునిస్తూపాలు ఏర్పాటు చేయనుంది అశోక్ సింఘాల్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో ఎమ్2కే ఫౌండేషన్ కూడా భాగమవ్వనుంది. రాముడు వనవాసం సమయంలో అయోధ్యనుంచి రామేశ్వరం వరకు ప్రయాణించిన 290 ప్రదేశాల్లో ఈ స్తూపాలను ఏర్పాటు చేయనుంది.
"రాజస్థాన్‌లోని మౌంట్ అబూ నుంచి తీసుకొచ్చిన శ్రీరామ స్తూపం ఇసుకరాయితో తయారైంది. వర్షం, దుమ్ము, నాచు ప్రభావం ఈ స్తూపంపై ఉండదు. శ్రీరాముని స్తూపం పొడవు 15 అడుగులు. పొడవు రెండున్నర అడుగులు. ఇప్పటివరకు ఒక్క శ్రీరాముని స్తూపం మాత్రమే వచ్చింది. మిగతావి త్వరలో వస్తాయి. ఈ స్తూపం దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నాం. మణిపర్వతంపై ఈ శ్రీరాముని స్తూపాన్ని ఏర్పాటు చేస్తాం. నిర్మాణం, ఇతర ఖర్చులన్నీ అశోక్ సింఘాల్ ఫౌండేషన్, ఎమ్2కే ఫౌండేషన్‌లు సంయుక్తంగా భరిస్తాయి. మొట్టమొదట శ్రీరాముడు మణిపర్వతం మీద ఉన్నాడు. అందుకే రాముని స్తూపాన్ని అక్కడే ప్రతిష్ఠిస్తున్నాం. ఆ తర్వాత గుప్తర్ ఘాట్, తంసా నది ఒడ్డున, సూర్యకుండ్ వద్ద ప్రతిష్ఠిస్తాం."