ఉత్తర్‌ప్రదేశ్ కాశీకి చెందిన 125 ఏళ్ల శివానంద బాబా.. కరోనా టీకా వేయించుకున్నారు. వాక్సిన్ కేంద్రానికి ఆయన నడుస్తూ వెళ్తుంటే అక్కడున్నవారంతా ఆయన కాళ్లపై పడి నమస్కరించారు.
1896 ఆగస్టు 8న బాబా జన్మించారు. 1977లో బృందావన్‌లోని ఆశ్రమంలో దీక్ష చేపట్టారు. అక్కడ 2 సంవత్సరాలు నివసించిన తరువాత, 1979లో శివ నగరమైన కాశీకి వచ్చారు. అప్పటి నుంచి కాశీలోనే నివసిస్తున్నారు. స్థోమత లేక పేద ప్రజలు పండ్లు, పాలు తీసుకోవడం లేదని బాబా కూడా వాటిని మానేశారు.