తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్​నాథ్​తో పవార్​ భేటీ- రైతు నిరసనలపై చర్చ?

దేశ రాజధాని దిల్లీలో.. రక్షణమంత్రి రాజ్​నాథ్​తో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ భేటీ అయ్యారు. మహారాష్ట్ర పురందర్​ వద్ద ప్రతిపాదించిన అంతర్జాతీయ విమానాశ్రయంపై చర్చించినట్టు పవార్​ ట్వీట్​ చేశారు. అయితే రైతు సంఘాలతో మంచి అనుబంధం ఉన్న పవార్​.. దిల్లీలో అన్నదాతలు నిరసనలు చేపట్టిన వేళ రాజ్​నాథ్​తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.

Sharad Pawar meets Rajnath Singh to discuss proposed International airport at Purandar
'లేఖ'పై రగడ మధ్య రాజ్​నాథ్​తో పవార్​ భేటీ

By

Published : Dec 9, 2020, 4:31 PM IST

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​తో దిల్లీలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర పుణెలోని పురందర్​ వద్ద ప్రతిపాదించిన అంతర్జాతీయ విమానాశ్రయంపై చర్చించేందుకు రాజ్​నాథ్​ను కలిసినట్టు ట్వీట్​ చేశారు పవార్. రక్షణ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శితోనూ ఈ విషయంపై చర్చించినట్టు వివరించారు. పనులు వేగవంతం చేయాలని కోరినట్టు స్పష్టం చేశారు.

అయితే... సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు ఉద్ధతంగా సాగుతున్న వేళ రాజ్​నాథ్​-పవార్​ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పని చేసిన పవార్​కు రైతు సంఘాల నేతలతో మంచి అనుబంధం ఉండడం ఇందుకు ఓ కారణం.

ఇదీ చూడండి:-సాగు చట్టాలపై రైతు సంఘాలకు కేంద్రం లేఖ

ABOUT THE AUTHOR

...view details