Sexual assault: బాలికల ఉన్నత పాఠశాలలోని మూత్రశాలలో 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో బుధవారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
స్కూల్ టాయిలెట్లో 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Sexual assault: పాఠశాల మూత్రశాలలోకి లాక్కెళ్లి 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుర్ఘటన మహారాష్ట్ర, పుణె నగరంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇదీ జరిగింది: శివాజీనగర్ ప్రాంతంలోని ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో 11 ఏళ్ల బాలిక చదువుతోంది. బుధవారం రోజూలానే పాఠశాలకు వెళ్లింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి బాలికతో పాటే వచ్చాడు. ఆమెతో గొడవకు దిగి బలవంతంగా పాఠశాల మూత్రశాలలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి బాధితురాలు.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి వివరించింది. బాలిక తల్లి వెంటనే శివాజీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలికకు తెలిసిన వ్యక్తిగానే అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.