Sex With Dead Body: దిల్లీ బురారీలోని 24 ఏళ్ల యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను చంపిన అనంతరం నిందితుడు అమన్ సింగ్ బిష్ఠ్.. ఆ మృతదేహంపై అత్యాచారం చేసినట్లు తేల్చారు. అతడిని అరెస్టు చేశారు.
కారణం తెలిసి షాక్..
విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విని.. పోలీసులు షాక్ అయ్యారు. మృతురాలు.. అమన్ భార్య స్నేహితురాలు కావడం గమనార్హం. ఆమెతో సెక్స్ చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించిందని, అందుకే చంపేసి లైంగిక చర్య చేసినట్లు చెప్పాడు.
ఫిబ్రవరి 19న నిందితుడి భార్య.. కాశిక్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె స్నేహితురాలు అర్ధనగ్నంగా పడి ఉండటాన్ని గమనించింది. ఆమె భర్త పరారయ్యాడు. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్తనే అనుమానితుడిగా భావించి.. సోమవారం అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు.
Rape victim suicide:అత్యాచార బాధితురాలు(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని చాంద్‌పుర్ గ్రామంలో జరిగింది. ఆమెపై 2019లో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.