ఏకధాటి వర్షాలతో కేరళలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి(kerala rains ). పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
కుట్టునాడులో నీట మునిగిన ఇళ్లు ఎర్నాకుళంలో నీట మునిగిన రహదారులు కుట్టునాడులో నీట మునిగిన ఆవాసాలు ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను, మరో 8 జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో మధ్య కేరళ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
కుట్టునాడులో నీట మునిగిన ఆవాసాలు కేరళలో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ సూచించారు(kerala latest news). కొండచరియలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు ఆహార, నివాస ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:Violence in north east india: ఈశాన్యంలో ఆరని కుంపటి