కర్ణాటకలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నదిలో పడి కొట్టుకుపోతున్న సమయంలో ఓ బస్సు డ్రైవర్ చూసి కాపాడారు. అనంతరం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. మానవత్వంతో డ్రైవర్ బస్సును ఆపి మరీ.. నదిలో దూకి కాపాడిన తీరును చూసి అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నదిలో జారిపడ్డ అక్కాచెల్లెళ్లు.. ఆర్టీసీ డ్రైవర్ సాహసంతో ఇద్దరూ సేఫ్ - కర్ణాటకలో నదిలో పడిపోయిన బాలికలు న్యూస్
నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను అటుగా వెళ్తున్న కేఎస్ఆర్టీసీ డ్రైవర్ చూసి రక్షించారు. అనంతరం ఇద్దరినీ చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఈ మానవీయ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదీ జరిగింది.. హందికుంటె అగ్రహార నదిలో బట్టలు ఉతికేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెళ్లారు. అనుకోకుండా ఆ బాలికలు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. సరిగ్గా అదే సమయానికి నాగేనహళ్లి నుంచి శిరా మార్గంలో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మంజునాథ్ ఈ ఘటనను చూశారు. ఆయన వెంటనే బస్సును పక్కకు ఆపి.. ఆలస్యం చేయకుండా నదిలోకి దూకి ఆ ఇద్దరు బాలికలను చాకచక్యంగా కాపాడారు. అనంతరం వారిద్దరినీ బరగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. మంజునాథ్ బాలికలను కాపాడిన తీరును చూసి అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డ్రైవర్ చేసిన మంచి పనికి కేఎస్ఆర్టీసీ సీనియర్ అధికారులు కూడా మెచ్చుకున్నారు.