అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ(ఏఎంయూ) చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 'టైమ్ క్యాప్సుల్'ను ఏర్పాటు చేశారు. సుమారు 1.5 టన్నుల బరువున్న ఈ స్టీల్ క్యాప్సూల్‌ను విక్టోరియా గేట్ ఎదురుగా.. 30 అడుగుల లోతులో భద్రపరిచారు. ఆన్లైన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనేక రచనలు..
టైమ్ క్యాప్సూల్‌లో 100 సంవత్సరాల చరిత్రను వివరించే చారిత్రక పత్రాలు, సమావేశాల సంక్షిప్త సమాచారం, ఇతర దస్త్రాలను భద్రపరిచారు. అలాగే.. 1920లో ఆమోదించిన ఏఎంయూ చట్టం.. ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఖాలిక్ అహ్మద్ నిజామి రచనలు సహా అనేకం ఉన్నాయి.
ఏఎంయూ చరిత్రను భవిష్యత్ తరాలకు అందిచాల్సిన అవసరం ఉంది. చరిత్రాత్మక పత్రాల సంరక్షణ కీలకమైన అంశం.