తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నిర్దోషులంతా పరిహారం కోరితే ఎలా, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు - తప్పుడు కేసుల బాధితులపై సుప్రీంకోర్టు తీర్పు

తప్పుడు కేసుల్లో విచారణ ఎదుర్కొన్న బాధితులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పింది. ఈ విషయంపై సంబంధిత సంస్థలే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

.supreme court judgement
supreme court

By

Published : Aug 19, 2022, 9:39 AM IST

Supreme Court on Wrongful Prosecution: చేయని నేరానికి విచారణ ఎదుర్కొన్న బాధితులకు పరిహారమిచ్చేలా, క్రిమినల్‌ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించటానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఇది చట్టరూపకల్పనతో ముడిపడిన అంశమని, చాలా సమస్యలను సృష్టిస్తుందని న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. ''ఇందులో న్యాయస్థానాలు చేసేదేమీ లేదు. విషయం కేంద్రం, సంబంధిత సంస్థల దృష్టిలోకి వచ్చింది. చర్యలు తీసుకోవాల్సింది వారే'' అని తెలుపుతూ పిటిషన్లను కొట్టివేసింది. ''పోక్సో, గృహహింస కేసుల్లో విడుదలైన వారంతా తప్పుడు ప్రాసిక్యూషన్‌కు గురయ్యామని ఆరోపించవచ్చు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందే సంబంధిత సంస్థలే'' అని ధర్మాసనం తెలిపింది.

అసెస్‌మెంట్‌ అధికారి పరిధిలోని హైకోర్టులోనే అపీళ్లు
ఆదాయపు పన్ను అపిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) ఉత్తర్వులను సవాల్‌ చేసే అపీళ్ల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. మదింపు (అసెస్‌మెంట్‌) అధికారి ఉండే అధికార పరిధిలోని హైకోర్టులోనే అపీళ్లు ఉంటాయని పేర్కొంది. కొన్ని ఐటీఏటీ బెంచ్‌ల పరిధి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది. దీంతో అయోమయం నెలకొంది. దీన్ని దూరం చేస్తూ మదింపు అధికారి పరిధిలోని హైకోర్టుల్లోనే ఐటీఏటీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలయ్యే అపీళ్లు ఉంటాయని న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌, జస్టిస్‌ పి.నరసింహ ధర్మాసనం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details