నల్లధనం, బినామీ వంటి కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. 100 శాతం నల్లధనాన్ని జప్తు చేయడం సహా, లంచం, బినామీ వంటి కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేలా కేంద్రం చట్టాలు తేవాలని కోరుతూ భాజపా నేత, అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. శాసన, కార్యనిర్వాహక అంశాల్లో తాము జోక్యం చేసుకోలేమని, చట్టాలు చేయమని పార్లమెంటుకు ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా.. జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషికేశ్ సభ్యులుగా గల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
'' మీకు రెండు విషయాలు చెప్తాను. శాసన, కార్యనిర్వాహక అని రెండు విభాగాలు ఉంటాయి. వాటిని పరిశీలించేందుకు న్యాయ వ్యవస్థ ఉంటుంది. దేని పని, పరిధి దానిదే. అంతేగానీ.. మూడింటి బాధ్యతలు చేపట్టాలని మీరు న్యాయ విభాగాన్ని అడగలేరు. రాజ్యాంగం కూడా అలా చెప్పదు.