2000 Red Fort attack case: 2000 ఎర్రకోట ఉగ్ర దాడి కేసులోని దోషికి మరణ శిక్షే సరైనదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మరణశిక్ష తీర్పును పునఃసమీక్షించాలంటూ నిందితుడు చేసుకున్న అభ్యర్థనను గురువారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థనను అంగీకరించినట్లు చీఫ్ జస్టిస్ యూయూలలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
"ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థను మేము అంగీకరించాము. అతని నేరం రుజువైంది. కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేము ధృవీకరించి రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాము" అని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ దాడుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లతో పాటు ముగ్గురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఆరిఫ్ ఒకడు. కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత ఆరిఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.