తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ! - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు సీజేఐ జస్టిస్ బోబ్డే. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు.

bobde recommends justice nv ramana as the next cji
తదుపరి సీజేగా జస్టిస్ రమణ- జస్టిస్​ బోబ్డే సిఫార్సు

By

Published : Mar 24, 2021, 11:17 AM IST

Updated : Mar 24, 2021, 1:10 PM IST

భారత దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్​వీ రమణను నియమించాలని ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ రమణ పేరును సిఫార్సు చేస్తూ లేఖ రాశారు. జస్టిస్ రమణ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు.

జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

ఇదీ ప్రక్రియ..

జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ సమీక్షించిన తర్వాత కేంద్ర హోంశాఖకు పంపుతుంది. కేంద్ర హోంశాఖ పరిశీలన తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి ప్రతిపాదన చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక పూర్తవుతుంది.

రాష్ట్రపతి సమ్మతి లభిస్తే.. ఏప్రిల్‌ 24న సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగస్టు 26 వరకు 16 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు.

జస్టిస్ రమణ నేపథ్యం

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

ఇదీ చదవండి:ఎన్నికల దృష్ట్యా బడ్జెట్ సమావేశాలు కుదింపు!

Last Updated : Mar 24, 2021, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details