రష్యా నుంచి భారత్ (s400 India) కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ క్షిపణులు చైనా, టర్కీకు ఇచ్చామని మరో ఏడు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను (s-400 Missile System India) కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణుల కొనుగోలు కోసం.. 500 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తోంది భారత్. ఇప్పటికే గతేడాది 800 మిలియన్ డాలర్లను రష్యాకు చెల్లించింది. అయితే దీనిపై తొలి నుంచి అమెరికా (s400 india-us) అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం వల్ల రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ప్రాంతీయ భద్రత, రక్షణ అవసరాలరీత్యా భారత్‌కు ఎస్-400 విషయంలో మినహాయింపునివ్వాలని కోరుతూ అక్కడి సెనేటర్లు అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే రష్యా నుంచి ప్రకటన రావడం గమనార్హం.