తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2021, 10:36 PM IST

ETV Bharat / bharat

IT Raids News: ఐటీ దాడుల్లో రూ.200 కోట్ల నల్లధనం పట్టివేత

మహారాష్ట్ర పుణెలోని ఓ సంస్థపై దాడులు (IT Raids News) చేపట్టారు ఐటీ అధికారులు. రూ. 200 కోట్ల నల్లధనం బయటపడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

IT Raids News
ఐటీ దాడులు

మహారాష్ట్ర పుణెలోని ఓ బడా మ్యానుఫ్యాక్చరింగ్​ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు (IT Raids News) చేశారు. ఈ సోదాల్లో రూ. 200 కోట్ల నల్లధనం బయటపడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఈ సంస్థ ఎక్స్‌కవేటర్‌లు, క్రేన్‌లు వంటి భారీ యంత్రాలను తయారు చేస్తోందని పేర్కొంది.

నవంబరు 11న 7 నగరాల్లోని 25 కార్యాలయాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రైడ్​లో రూ. కోటి మేర నగదు, విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మూడు బ్యాంక్​ లాకర్లను సీజ్​ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా రూ. 200 కోట్ల మేర లెక్క చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు చెప్పారు.

ఎలక్ట్రానిక్ డేటా రూపంలో చాలా పత్రాలు, మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించగా.. క్రెడిట్ నోట్స్ ద్వారా అమ్మకాలను కృత్రిమంగా తగ్గించినట్లు గుర్తించారు. వీటితో పాటు ఆధారాలు లేని వాణిజ్య చెల్లింపుల ద్వారా ఖర్చులను చూపించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కర్తార్​పుర్​ కారిడార్​ రీఓపెన్- పంజాబ్ నేతల హర్షం

ABOUT THE AUTHOR

...view details