తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేజస్​ ఎక్స్​ప్రెస్ సేవలు రద్దు - tejas trains

కరోనా నేపథ్యంలో తేజస్​ ఎక్స్​ప్రెస్​ రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. ప్రయాణికులు తక్కువగా వస్తుండటం వల్ల.. రైలు నిర్వహణ భారంగా మారిందని ఐఆర్​సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

irctc-to-suspend-operations-of-tejas-express-from-today
నిర్వహణ భారం- తేజస్​ ఎక్స్​ప్రెస్ సేవలు రద్దు

By

Published : Nov 23, 2020, 7:37 PM IST

లఖ్​నవూ-దిల్లీ, అహ్మదాబాద్​-ముంబయి మధ్య నడిచే కార్పొరేట్​ తేజస్​ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. కరోనా నేపథ్యంలో.. తక్కువ మంది ప్రయాణికులతో నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు తేజస్​ రైళ్ల కార్యకలాపాలు సాగవని స్పష్టం చేసింది.

ఐఆర్​సీటీసీ పర్యవేక్షణలో నడిచే ఈ తేజస్​ ఎక్స్​ప్రెస్​ సర్వీసులు.. లాక్​డౌన్​ అనంతరం అక్టోబర్​ 17న తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. మహమ్మారి భయాల నేపథ్యంలో ప్రయాణికులు వీటిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా.. వ్యయంతో కూడుకున్న ఈ​ ట్రైన్ల నిర్వహణ కష్టంగా మారింది.

ఇటీవల కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రైళ్లలో ప్రయాణికుల కోసం మార్గదర్శకాలు రూపొందించింది రైల్వే శాఖ. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే రైలు ప్రయాణం చేయాలని సూచించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details