మహిళల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న క్రమంలో ఆయన సతీమణి రష్మి త్యాగి.. మద్దతుగా నిలిచారు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. సందర్భానుసారంగా వివరించలేదన్నారు.
'భారత సమాజాన్ని నిర్మించటంలో మహిళల పాత్ర మరువలేనిది.. మన దేశ సంస్కృతిని, ఐక్యతను, వస్త్రాలను కాపాడటం భారత స్త్రీల బాధ్యత' అని ముఖ్యమంత్రి అన్నారని తెలిపారు. కేవలం కొన్ని పదాలను మాత్రమే పట్టుకుని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వివాదాస్పదం చేస్తున్నారని వివరించారు.