ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది గుజరాత్ సర్కార్. ఇకపై కేవలం జియో నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్-ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ నంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్ సేవలను.. ఉద్యోగులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.
గత కొంత కాలంగా గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు వొడాఫోన్-ఐడియా పోస్ట్‌పెయిడ్ సర్వీసులను వాడుతున్నారు. ఇకపై ఉద్యోగులెవ్వరూ వొడాఫోన్-ఐడియా సర్వీసులను వాడొద్దని సోమవారం గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కేవలం నెలకు రూ.37.50కే పోస్ట్‌పెయిడ్ సేవలను జియో అందిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఏ మొబైల్ ఆపరేటర్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్ చేయవచ్చని వివరించింది. దాంతో పాటు నెలకు 3వేల ఉచిత SMSలను వాడుకోవచ్చని పేర్కొంది. ఈ SMSల పరిధి దాటితే.. ఒక్కో మెసేజ్‌కు జియో 50పైసలను ఛార్జ్ చేస్తుందని తెలిపింది. అదే విధంగా అంతర్జాతీయ SMSలకు రూ.1.25లను ఛార్జ్ చేస్తుందని తెలిపింది.
ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా, 4జీ సర్వీసులతో లభిస్తుంది. వాటి పరిధి ముగిసినట్లయితే మరో 25 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మరో 60 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. ఒకవేళ అన్లిమిటెడ్ డేటా కావాలనుకుంటే.. 125 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 5జీ సేవలను కూడా 4జీ సేవల ధరలకే జియో అందిస్తోంది.