పుణె నుంచి కొవిడ్ టీకాను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గురువారం ప్రకటించింది. సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా, ఏఏఐ, వాయుసేన మధ్య బుధవారం జరిగిన చర్చపై ఈ విధంగా స్పందించింది. టీకా తరలింపు, విమానాశ్రయ సామర్థ్యంపై చర్చ జరిగినట్లు పుణె విమానాశ్రయ డైరెక్టర్ కుల్దీప్ సింగ్ వెల్లడించారు.
ప్రతిరోజు పుణె విమానాశ్రయం దేశంలోని 15 ప్రాంతాలకు 40 విమానాలను నడుపుతోంది. రోజుకి 150 టన్నుల కార్గోను సరఫరా చేస్తుంది. కొవిడ్ టీకాను పంపిణీకి తరలించేందుకు ఏఏఐ, ఏఏఐసీఎల్ఏఎస్ సిద్ధంగా ఉన్నాయి.