తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గన్​తో బెదిరించి రేప్​.. కారుణ్య మరణానికి బాధితురాలి విజ్ఞప్తి - కర్ణాటక బెంగళూరు వార్తలు

Rape victim news: అద్దెకు ఉంటున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. మరోవైపు తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ ఓ మహిళ ఐజీకి లేఖ రాసింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి గత కొన్ని నెలల ఎదుర్కొంటున్న వేధింపులను ఇక భరించలేనని పేర్కొంది.

rape
rape

By

Published : May 23, 2022, 1:16 PM IST

Rape victim news: తుపాకీతో బెదిరింపులకు పాల్పడి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. కర్ణాటకలోని బెంగళూరులో ఏప్రిల్​ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. తాను చాలా పలుకుబడి గల వ్యక్తినని, అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని బిహార్​కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

వేధింపులు భరించలేక..: ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ మహిళ తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని కోరుతూ ఐజీకి లేఖ రాసింది. గత ఆరు నెలలుగా వాట్సాప్​ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి నుంచి వేధింపులకు గురవుతున్నానని.. ఇక ఈ వేధింపులు భరించలేనని లేఖలో పేర్కొంటూ వాపోయింది. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని.. తన కుటుంబసభ్యులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపింది.

పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న తాను ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అయినా ఫలితం లేకపోయిందని బాధితురాలు పేర్కొంది. ఈ వేధింపులు భరించలేక తన సోదరి ఇప్పటికే రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలి సోదరుడు వెల్లడించాడు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి :వరుడి విగ్గు ఊడటం చూసి వధువు షాక్​.. పెళ్లి అర్థాంతరంగా రద్దు

ABOUT THE AUTHOR

...view details