తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురిపై రేప్​- కోర్టు ఆవరణలోనే నిందితుడిని కాల్చి చంపిన తండ్రి! - భార్యను కామెంట్​ చేశాడని కంటిలో పొడిన వ్యక్తి

Rape accused shot dead: అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్​ఎఫ్​ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న కారణంతోనే చంపినట్లు తెలుస్తోంది.

Rape accused shot dead outside court
కోర్టు ఆవరణలో అత్యాచారం నిందితుడ్ని కాల్చి చంపిన మాజీ జవాను

By

Published : Jan 22, 2022, 2:24 PM IST

Rape accused shot dead: అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడ్ని ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు. చనిపోయిన వ్యక్తిని బిహార్​లోని ముజఫర్‌పుర్​కు చెందిన దిల్షాద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు.

ఓ కేసు విచారణ నిమిత్తం​ హాజరయ్యేందుకు కోర్టు గేటు వద్దకు శుక్రవారం చేరుకున్నాడు దిల్షాద్​. అప్పుడే భగవత్​ నిషాద్​ అనే బీఎస్​ఎఫ్​ మాజీ జవాన్​ దిల్షాద్​ను కాల్చి చంపాడు. భగవత్​ను అరెస్టు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

ఇదే కారణమా?

2020 ఫిబ్రవరిలో భగవత్​ కుమార్తెను దిల్షాద్​ కిడ్నాప్​ చేశాడు. పోలీసులు ఆమెను కాపాడారు. అప్పుడే అతనిపై అత్యాచారం కేసు కూడా నమోదైంది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న కోపంతోనే నిషాద్​.. దిల్షాద్​ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

యువతిపై సామూహిక అత్యాచారం..

రాజస్థాన్​లోని జైపుర్​లో 24 ఏళ్ల యువతిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సోషల్​ మీడియా ద్వారా పరిచయం అయిన ఓ యువకుడు ఆమెతో సన్నిహితంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో హోటల్​కు రావాల్సిందిగా యువతిని ఆ కుర్రాడు కోరాడు. అతడ్ని నమ్మిన ఆ అమ్మాయి హోటల్​కు వెళ్లింది. దీంతో ఆమెకు మత్తు మందు ఇచ్చి మరో మరో వ్యక్తితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

భార్యను కామెంట్​ చేశాడని..

భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని కంటిలో పొడిచాడు మరో వ్యక్తి. ఈ ఘటన దిల్లీలోని ఠాగూర్​ గార్డెన్​లో జరిగింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం- ఐదుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details