తమిళ ప్రజల నిరీక్షణకు తెరదించుతూ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. పార్టీకి సంబంధించిన వివరాలను ఈ నెల 31న ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే తన పార్టీ పర్యవేక్షకుడిగా తమిళరువి మణియన్, పార్టీ సమన్వయకర్తగా అర్జునమూర్తిని నియమించారు రజనీ. ఇంతకీ వీరిద్దరు ఎవరు? పార్టీలోని కీలక బాధ్యతలను రజనీ వీరికి ఎందుకు అప్పగించారు?
అర్జునమూర్తి...
- స్వాతంత్ర్య సమరయోధుడు ఎల్పీ రామసామి కుమారుడు అర్జునమూర్తి.
- 59ఏళ్ల అర్జునమూర్తి.. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్త. వాణిజ్యం, టెలికమ్యూనికేషన్, వాణిజ్యం వంటి రంగాలపై ఈయనకు అద్భుతమైన పట్టు ఉంది.
- జీనీ, సాఫ్ట్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎఫ్సీ టెక్నాలజీ సంస్థలను అర్జునమూర్తి స్థాపించారు.
రాజకీయ ప్రస్థానం:-
- డీఎమ్‌కే సీనియర్ నేత, దివంగత మురసొలి మారన్‌కు రాజకీయ సలహాదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు అర్జునమూర్తి. డీఎమ్‌కే నేత దయానిధి మారన్‌కు కూడా పనిచేశారు.
- అదే సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై మక్కువతో భాజపాతోనూ అనుబంధం ఏర్పరచుకున్నారు. అనంతర ఎన్నికల్లో భాజపాకు మేనిఫెస్టోను రూపొందించారు. ఆయన కృషికి భాజపా పెద్దల నుంచి ప్రశంసలు లభించాయి.
- అనేక మార్లు భాజపాకు మద్దతుగా నిలిచిన రజనీకాంత్.. అనూహ్యంగా అర్జునమూర్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించారు.