రాజస్థాన్ జైపుర్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. సుమారు 82 క్వింటాళ్ల అమ్మోనియం నైట్రేట్, 2095 జిలెటిన్ స్టిక్స్‌ను స్పెషల్ టీం పట్టుకుంది. వీటితో పాటు 3250 మీటర్ల ఫ్యూజ్ వైర్, 1600 డిటోనేటర్లు సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
అడిషనల్ డీసీపీ సులేశ్ చౌదరి మాట్లాడుతూ.. కమిషనరేట్ స్పెషల్ టీం, హర్మడా పోలీసులు సంయుక్తంగా మోహన్బరి గ్రామంలో తనిఖీలు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించాయని చెప్పారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని.. కలురామ్, గోపాల్ లాల్ అనే సోదరులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ పదార్థాలను నీమ్కథనాకు చెందిన జగదీశ్ సింగ్ వద్ద నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు.