తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమార్తెనే గర్భవతిని చేసిన తండ్రి.. అబార్షన్​కు ఒప్పుకోలేదని... - గర్భవతిని చంపిన తండ్రి

కన్న కుమార్తెను అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడ్డారు ఓ కీచక తండ్రి. గర్భవతి కావడం వల్లే ఆమెను హత్య చేసినట్లు సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

Rajasthan Father Rapes Teenage Daughte
కుమార్తెపై అత్యాచారం

By

Published : Sep 24, 2021, 2:35 PM IST

రాజస్థాన్​ రాజధాని జైపుర్​కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. బాధితురాలి తల్లి తన భర్తపై గురువారం సాయంత్రం జైపుర్​ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది

వావివరుసల మరచిన ఓ కిరాతక తండ్రి తన కూతురితోనే మానవ మృగంలా ప్రవర్తించాడు. కొంతకాలం క్రితం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఇది తెలిసిన అతడు.. అబార్షన్​ అయ్యేలా సిరప్స్, మాత్రలు వేసుకోమని ఆమెను బలవంతం చేశాడు. ఇందుకు బాధితురాలు అంగీకరించకపోగా.. గొంతుకోసి హత్య చేసి పరారయ్యాడు.

"కుమార్తె గర్భవతి అయిన తర్వాత నా భర్త బాగోతం బయటపడింది. మంగళవారమే అసలు విషయం తెలిసింది. అబార్షన్​ మాత్రలు, సిరప్​ తీసుకోమని కుమార్తెను బలవంతం చేశాడు. అందుకు ఆమె తిరస్కరించగా.. గొంతుకోసి చంపేశాడు."

- బాధితురాలి తల్లి

ఈ మేరకు నిందితుడి భార్య ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తమకు సమచారం అందిందని పేర్కొన్నారు.

దీంతో దర్యాప్తు చేయడానికి బాధితురాలి ఇంటికి చేరుకున్న పోలీసు బృందానికి.. అబార్షన్ మాత్రలు, సిరప్‌లు కనిపించినట్లు వెల్లడించారు. అలాగే "బాలికను గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన బుధవారం జరిగింది. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయాలు బయటపడతాయి. అలాగే ఆమె గర్భవతి అవునా? కాదా? అన్నది తెలుస్తుంది" అని చెప్పారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. తన కుమార్తెను భర్తే అత్యాచారం చేసినట్లు తెలిసినా.. బాధితురాలి తల్లి ఇప్పటివరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న నిందితుడి కోసం అన్నిచోట్ల గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:మోడల్‌కు తప్పుడు హెయిర్​కట్-​ రూ.2 కోట్ల పరిహారం!

ABOUT THE AUTHOR

...view details