Child Trapped Borewell: రాజస్థాన్ సీకర్ జిల్లాలో.. 50 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన నాలుగున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు దక్కాయి. 24 గంటలకుపైగా శ్రమించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని బయటకు తీశాయి. బోరుబావికి సమాంతరంగా.. ఓ సొరంగం తవ్వి ఆపరేషన్లో సఫలం అయినట్లు వెల్లడించారు. ఆ బాలుడ్ని వెంటనే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
సరదాగా ఆడుకుంటున్న బాలుడు గురువారం.. అకస్మాత్తుగా బోరుబావిలో పడిపోయాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. సీసీటీవీ కెమెరాలతో బోరుబావిలోని బాలుడి కదలికలను సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
అక్కడ విషాదం..
Borewell Boy died: మధ్యప్రదేశ్లో పొరపాటున బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. దాదాపు 16 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు.. చిన్నారిని బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.