భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన కల్యాణ్ సింగ్ ప్రస్థానం.. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే వారికి పాఠం వంటిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో ప్రత్యర్థులను సైతం నేర్పుగా ఆకట్టుకోగలిగిన ఆయన.. తన పట్టుదల, సంకల్పమే ఆయుధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి.. అత్యున్నత పదవులు పొందే స్థాయికి చేరారు. పోరాటం, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చనేదానికి కల్యాణ్ సింగ్ జీవితం నిదర్శనం.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి సీఎంగా..
తిరుగులేని విజయాలు..
రాజకీయ చతురత..
1993 ఎన్నికల్లో భాజపా మెజారిటీ సాధించినప్పటికీ.. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ప్రతిపక్ష హోదాలోనూ తనదైన శైలిలో నిరసన గళం వినిపించారు కల్యాణ్ సింగ్. 'గెస్ట్ హౌస్' ఘటనతో నాలుగేళ్లలోపే సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉండగా.. బీఎస్పీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది భాజపా. ఆరు నెలల ఒప్పందానికిగాను మాయావతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. భాజపాకు సీఎం పీఠాన్ని అప్పగించే సమయంలో బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకుని షాక్ ఇచ్చింది. ఆ సమయంలోనూ కల్యాణ్ సింగ్ పట్టువదలలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకుసాగారు. ఈ నేపథ్యంలో.. అప్పుడే కాంగ్రెస్‌ను వీడి లోకతాంత్రిక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటుచేసిన నరేష్ అగర్వాల్‌ను కలిశారు కల్యాణ్ సింగ్. నరేష్ అగర్వాల్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు అండగా నిలిచిన అగర్వాల్‌కు విద్యుత్ శాఖను కేటాయించి రాజకీయ చతురతను చాటారు.