తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాత్కాలికంగా నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్లు! - indian Railways

కరోనాకు ముందున్న సేవలను పునరుద్ధరించే ప్రణాళికల్లో భాగంగా రిజర్వేషన్​లను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వచ్చేవారం రోజులపాటు.. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్​ఎస్) రాత్రి సమయాల్లో ఆరు గంటలు పనిచేయదని ఒక ప్రకటనలో తెలిపింది.

Railway
Railway

By

Published : Nov 14, 2021, 6:12 PM IST

ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాకు ముందున్న విధంగా రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రైల్వే.. పునరుద్ధరణ కోసం చేపట్టే నిర్వహణ చర్యల్లో భాగంగా పలు సేవలను నిలిపేస్తున్నట్లు పేర్కొంది.

ఆదివారం నుంచి నవంబర్ 20వ తేదీ రాత్రి వరకు కొనసాగనుంది. ఈ తేదీల్లో రాత్రి 11.30కు ప్రారంభమై ఉదయం 5:30కు ముగియనుంది. ఆయా సమయాలను ప్రయాణికులు గమనించాలని అధికారులు తెలిపారు.

ఈ సమయంలో టికెట్ రిజర్వేషన్, రద్దు, కరెంట్ బుకింగ్, విచారణ వంటి మొదలైన సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. పీఆర్​ఎస్​ సేవలు మినహా ఇతర సర్వీసులన్నీ నిరంతరాయంగా కొనసాగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details