తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైళ్లలో 64 వేల కొవిడ్ పడకలు సిద్ధం' - railway coach

దేశంలో కరోనా కేసుల భారీ పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రాలు వినియోగించుకునేలా 64 వేల కొవిడ్ పడకలను సిద్దం చేశామని భారతీయ రైల్వే వెల్లడించింది. 4వేల కొవిడ్ కోచ్‌లలో ఇప్పటికే 169 కోచ్‌లను వివిధ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని తెలిపింది.

railway
భారతీయ రైల్వే

By

Published : Apr 28, 2021, 4:56 AM IST

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాలు వినియోగించుకునేలా 64 వేల కొవిడ్ పడకలను సిద్దం చేశామని భారతీయ రైల్వే వెల్లడించింది. 4వేల కొవిడ్ కోచ్‌లలో ఇప్పటికే 169 కోచ్‌లను వివిధ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ప్రతి కోచ్‌లో 16 మంది రోగులు ఉండేలా అత్యాధునికంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రైల్వే రూపొందించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలతో సహా వైద్యపరికరాలను ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ ఏర్పాటు చేస్తుందని..వివరించింది.

నాగపూర్‌ కోరిన వెంటనే 11 కొవిడ్ రేక్‌లను అందజేశామని రైల్వేశాఖ తెలిపింది. మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని 9 ఇతర ప్రధాన స్టేషన్ల వద్ద కొవిడ్‌ కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించింది.

ఇదీ చదవండి :'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ABOUT THE AUTHOR

...view details