మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ లక్ష్యంగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కేరళ కొట్టాయం జిల్లా ఎరుమేలిలోని అయ్యప్ప దేవాలయం, వావర్ మసీదులో ఆయన శనివారం ప్రార్థనలు చేశారు. అనంతరం.. పతనమ్తిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
"సంతోషంగా, ప్రశాంతంగా జీవించడం, ఇతరుల ప్రయోజనాలను పరిరక్షించడం.. ఇదే దేశానికి మనం ఇవ్వగలిగే అతిపెద్ద కానుక. ఆర్ఎస్ఎస్తో పాటు ప్రధాని... ప్రజల మధ్య ద్వేషాన్ని సృష్టిస్తున్నారు. దానివల్ల ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు.. మరో సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లతో గొడవలకు దిగుతారు. ఇలాంటి విభజన శక్తుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి."