కొవిడ్-19 మూడో దశ.. చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో వైరస్‌ను ఎదుర్కోవటానికి కేంద్రం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
"కొవిడ్ మూడో దశ దృష్ట్యా చిన్నారులకు వైరస్ నుంచి సంరక్షణ అవసరం. చిన్నపిల్లలకు వైద్యసేవలు, వ్యాక్సిన్ ఇప్పటికే అందించాల్సింది. భారత భవిష్యత్తును కాపాడేందుకు మోదీ ప్రభుత్వం.. నిద్రలేవాలి."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ప్రపంచంలో చాలా దేశాలు 12-15ఏళ్ల పిల్లలకు టీకా ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సన్నాహక చర్యలేవి?