రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ అయినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే దీనిని ఖండించిన ట్విట్టర్.. రాహుల్ ఖాతా సస్పెండ్ కాలేదని.. కేవలం లాక్ అయిందని పేర్కొంది. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. 'ట్విట్టర్ ఖాతాను నిలిపివేసినప్పటికీ రాహుల్‌గాంధీ ఇతర ప్రత్యామ్నాయ వేదికల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటార'ని పేర్కొంది. 'సామాన్యుల కోసం తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటారని.. వారి తరఫున పోరాడతాడని' ట్వీట్ చేసింది.
అందుకేనా..?
దిల్లీలో కాంట్ ప్రాంతంలో 9 ఏళ్ల బాలికపై కాటికాపరి సహా మరో ముగ్గురు అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురికి న్యాయం చేయాలని కోరుతూ ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకుని వారికి సంతాపం తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వారకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు.
అయితే ఈ ఫొటోలో బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపించేలా ఉన్నందున జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్) ట్విట్టర్‌కు నోటీసులు పంపింది. పోక్సో, జువెనైల్ చట్టాలను అది ఉల్లంఘిస్తోందని సూచిస్తూ ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఖాతాపై చర్యలు తీసుకోవాలని కోరింది. తొలుత ఈ అంశంపై స్పందించిన ట్విట్టర్.. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ట్వీట్‌ను తొలగించింది. ప్రస్తుతం ఖాతాను సస్పెండ్ చేసింది.
ఇవీ చదవండి: