సాగు చట్టాలను చర్చ లేకుండానే ఆమోదించారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విపక్షాలను పార్లమెంట్లో ప్రభుత్వం మాట్లాడనివ్వదని అసోం ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తారు. అయినా ప్రజల కోసం బలంగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పారు.
"అసోం సంస్కృతి, భాష, చరిత్ర, సహృద్భావంపై భాజపా దాడిచేస్తోంది. మేము విద్వేషాన్ని తొలగించి, శాంతిని స్థాపిస్తాం. దేశంలోని ఇద్దరు ముగ్గురు సంపన్న పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తారు. భాజపా ఒక్కో చోట ఒక్కోలా హమీలిస్తుంది. కానీ వాటిని నిలబెట్టుకోదు. నేను అబద్ధం చెప్పను. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు, అవి ఎలా నేరవేర్చామో చూడండి. ఇది మీ రాష్ట్రం. దీనిని నాగ్‌పుర్ (ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి) నుంచి నడిపించరాదు."