పన్నుల కోసం కేంద్రం దేశ ప్రజలను అధిక ధరల ఊబిలో నెట్టేస్తోందని మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'స్పీక్ అప్ అగెనెస్ట్ ప్రైస్ రైజ్' (పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి) అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధికార ట్విట్టర్లో ప్రారంభించారు. పెంచిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ప్రజలు.. తమ గళాన్ని వినిపించాలని కోరారు.
" భాజపా అంటే బర్డెన్ ది జనతా(ప్రజలపై భారం) పార్టీ. ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం ఎంత త్వరగా గళం వినిపిస్తే.. దేశానికి అంత మంచిది. రండి.. ఉద్యమంలో పాల్గొనండి." అని కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్.
" అధిక ధరలు ప్రజలకు శాపం. కేవలం పన్నుల కోసం అధిక ధరల ఊబిలో ప్రజలను కేంద్రం నెట్టేస్తోంది. దేశాన్ని కూల్చేందుకు సిద్ధమైన కేంద్రానికి వ్యతిరేకంగా మీ గళం వినిపించండి."