Rahul Gandhi Speech at Adilabad Meeting : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతు భరోసా అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే.. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో రాహుల్ పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్స్ మాఫియా పెరిగింది - అవినీతి పాలనతో తెలంగాణ నష్టపోయింది : రాహుల్ గాంధీ
Congress Public Meeting at Adilabad : ఈ సందర్భంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు ఎంత మందికి వచ్చాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. దొరల తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజా ధనాన్ని లూటీ చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భూములు, ఇసుక, మద్యంలో జరిగిన దోపిడీ సొమ్మంతా కేసీఆర్ కుటుంబంలోకి చేరిందన్న ఆయన.. పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని చెప్పారు. దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు కమీషన్లు దోచుకున్నారని రాహుల్ ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్‌లో రూ.5200 కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్న ఆయన.. తెలంగాణ వస్తే... ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని భావించామన్నారు. తెలంగాణ యువత కలలు, ఆశయాలను బీఆర్ఎస్ నేతలు నాశనం చేశారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో - ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మాస్టర్ ప్లాన్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డును తెచ్చింది. కాంగ్రెస్ ఇచ్చేది గ్యారంటీ కార్డు మాత్రమే కాదు.. అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కును కూడా ఇస్తోంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను చట్టంగా మారుస్తాం. ప్రభుత్వం లాక్కున్న భూములను మళ్లీ పేదలకే అప్పగిస్తాం. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2500 ప్రజల సర్కార్ వేస్తుంది. ప్రజల సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. - రాహుల్ గాంధీ,కాంగ్రెస్ అగ్ర నేత
ధరణి స్థానంలో 'భూమాత'.. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్ -
కేసీఆర్ అవినీతిపై మోదీ విచారణ జరిపించగలరా..? నరేంద్ర మోదీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. ఎంపీల క్వార్టర్స్ నుంచి తనను ఖాళీ చేయించారన్నారు. అవినీతిపరుడైన కేసీఆర్ జోలికి మాత్రం మోదీ వెళ్లరని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిపై మోదీ విచారణ జరిపించగలరా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి మోదీ దింపగలరా? అని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 3 నెలల్లోనే బీజేపీ గాలి పూర్తిగా పోయిందన్న రాహుల్.. ఆ పార్టీ గాలి ఒక్కసారిగా పోవడంతో మోదీ సైతం అయోమయంలో పడ్డారన్నారు.
ప్రజల తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, విద్యార్థులకు యువ వికాసం కింద రూ.5 లక్షలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. కేసీఆర్ దోచుకున్న ప్రజల సొమ్మును వసూలు చేసి ప్రజల ఖాతాల్లో వేస్తాం. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఒప్పందం ఉంది. మోదీకి కేసీఆర్, అసదుద్దీన్ మంచి మిత్రులు. మోదీకి దిల్లీలో కేసీఆర్, అసదుద్దీన్ అన్ని రకాల సాయం చేస్తారు. తెలంగాణలో కేసీఆర్, అసదుద్దీన్‌కు మోదీ సహాయం చేస్తారు. - రాహుల్ గాంధీ
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని కేసీఆర్ తప్పుడు మాటలు చెప్తున్నారు : రేవంత్ రెడ్డి