తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్ష పీఠంపై రాహుల్​ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో రాజీ పడేది లేదంటూ..

Rahul Gandhi Bharat Jodo Yatra : ఉదయ్​పుర్​లో జరిగిన చింతన్ శిబిర్​లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. 'ఒకే వ్యక్తి ఒకే పదవి' అనే విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కొనసాగబోయే వారికి పలు సూచనలు చేశారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi
Rahul Gandhi says that they are committed to One man one post decision taken in chintan shivir

By

Published : Sep 22, 2022, 4:26 PM IST

Updated : Sep 22, 2022, 4:47 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra : రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో జరిగిన చింతన్ శిబిర్ తీసుకున్న 'ఒకే వ్యక్తికి ఒకే పదవి' అన్న నిర్ణయాన్ని కచ్చితంగా ఫాలో అవుతామని రాహుల్​ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అనేది ఒక సంస్థాగత పదవి మాత్రమే కాదని.. అది ఒక సైద్ధాంతిక, నమ్మకమైన వ్యవస్థ అని అభివర్ణించారు. చింతన్ శిబిర్​లో ఏదైతే తీర్మానించామో.. దానికి తాము కట్టుబడి ఉన్నామని రాహుల్​ చెప్పారు. కాంగ్రెస్​కు ఎవరు అధ్యక్షులు అయినా.. ఆ పదవి కొన్ని ఆలోచనల సమూహం అనే విషయం గుర్తుంచుకోవాలని రాహుల్​ సూచించారు. 'మీరు చరిత్రాత్మక స్థానంలో అడుగు పెట్టబోతున్నారు.. ఆ స్థానం దేశ ఆకాంక్షను ప్రతిబింబించింది.. ఇకపై ప్రతిబింబిస్తుంది' అని పేర్కొన్నారు.

'మతతత్వాన్ని సహించకూడదు'
దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించారు రాహుల్ గాంధీ. మతతత్వాన్ని ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మతతత్వాన్ని సహించకూడదని పిలుపునిచ్చారు. అయితే ఈ యాత్రలో రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లోత్​ కూడా పోటో చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.

Last Updated : Sep 22, 2022, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details