తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ యాత్రతో బాహుబలిలా కాంగ్రెస్​.. ఎవరైనా తక్కువ అంచనా వేస్తే..' - కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​ న్యూస్​

Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారిలో బుధవారం యాత్రకు శ్రీకారం చుట్టగా.. నేడు అగస్తేశ్వరంలో పాదయాత్ర చేపట్టారు రాహుల్​ గాంధీ. మరోవైపు.. భారత్​ జోడో యాత్రతో సరికొత్త కాంగ్రెస్​ ఉద్భవిస్తుందని.. ఇది పార్టీకి సంజీవని వంటిదని అన్నారు సీనియర్​ నేత జైరాం రమేశ్​.

Rahul Gandhi Bharat Jodo Yatra-
Rahul Gandhi Bharat Jodo Yatra

By

Published : Sep 8, 2022, 5:20 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra : వరుస పరాజయాలు, కీలక నేతల నిష్క్రమణలతో నిరుత్సాహపడుతున్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు చేపడుతున్న భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలన్న సంకల్పంతో.. పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ నేతృత్వంలో మొదలైన యాత్ర గురువారం రెండో రోజుకు చేరింది. తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ నేడు పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి.. ముందుకు కదిలారు. ఈ క్రమంలో ఆయన వెంట భారత్‌ యాత్రీస్‌ (కాంగ్రెస్‌ నేతలు) ఉన్నారు. ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ బఘేల్​, పార్టీ సీనియర్​ నేతలు, ఎంపీలు చిదంబరం, కేసీ వేణుగోపాల్​ తదితరులు రాహుల్​తో కలిసి నడుస్తున్నారు.

నీట్​ అభ్యర్థిని అనిత కుటుంబ సభ్యులతో రాహుల్​
భారత్​ జోడో యాత్ర

అధికారికంగా ఈ యాత్ర బుధవారం సాయంత్రమే ప్రారంభమైనప్పటికీ.. ఈ రోజు నడక మొదలైంది. ఈ క్రమంలో ఆయన ప్రజల్ని పలకరిస్తున్నారు. వారి ఆవేదనలు వింటున్నారు. 2017లో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థిని అనిత కుటుంబాన్ని పరామర్శించారు రాహుల్​. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనిత తండ్రి షణ్ముగం, సోదరుడు మణిరత్నం కాసేపు రాహుల్​ వెంట నడిచారు.

భారత్​ జోడో యాత్రలో రాహుల్​ గాంధీ
రాహుల్​ వెంట భూపేశ్​ బఘేల్​, కేసీ వేణుగోపాల్​

భాజపా, ఆర్​ఎస్​ఎస్​.. విద్వేష రాజకీయాలతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత బుధవారం ఆరోపించారు. తండ్రిని కోల్పోయిన తాను దేశాన్ని.. ఇప్పుడు కోల్పోలేనని భావోద్వేగంగా చెప్పారు. అనేక సమస్యలతో సతమవుతున్న కాంగ్రెస్‌ను గాడినపెట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధచేయడమే లక్ష్యంగా.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళ్తారు. రోజూ రెండు విడతల్లో.. ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పాదయాత్ర జరగనుంది.

రాహుల్​ వెంట భూపేశ్​ బఘేల్​, కేసీ వేణుగోపాల్​

'కాంగ్రెస్​కు సంజీవని భారత్​ జోడో యాత్ర..' రాహుల్​.. భారత్​ జోడో యాత్ర నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు ఆ పార్టీ సీనియర్​ నేత జైరాం రమేశ్​. ఈ యాత్ర కాంగ్రెస్​ పార్టీకి దూకుడు నేర్పుతుందని.. ఇక ఎవరూ ఎదుర్కోలేని రీతిలో కాంగ్రెస్​ సరికొత్త అవతారంలో కనిపిస్తుందని అన్నారు. భాజపా ఈ యాత్ర గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే.. కాంగ్రెస్​కు అంత భయపడినట్లు స్పష్టంగా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

''నేను 100 శాతం విశ్వాసంతో చెబుతున్నా.. భారత్​ జోడో యాత్ర కాంగ్రెస్​కు సంజీవని లాంటిదే. పురాణాల్లో ప్రాణాలను రక్షించినట్లు ఇప్పుడు కాంగ్రెస్​ను ఈ యాత్ర రక్షిస్తుంది. ఇది కాంగ్రెస్​కు పునరుజ్జీవం తెస్తుంది. కాంగ్రెస్​ను పునరుత్తేజితం చేస్తుంది. కాంగ్రెస్​ను పునరుద్ధరిస్తుంది. ఇదో కాంగ్రెస్​ కొత్త అవతారం అవబోతోంది.''

- జైరాం రమేశ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఈ 137 ఏళ్లలో కాంగ్రెస్​ ఎన్నో అవతారాలు ఎత్తిందని.. ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపిస్తుందని జైరాం రమేశ్​ తెలిపారు. 'ఇప్పుడు దూకుడైన కాంగ్రెస్​.. చురుకైన కాంగ్రెస్​.. ఇంటింటా కాంగ్రెస్​ను చూస్తారు. ఇక పార్టీని ఎవరూ ఎదుర్కోలేరు.' అని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి :'దేశంలో ఎన్నో సవాళ్లు.. రాహుల్​ అధ్యక్షుడైతేనే సాధ్యం'

'ఆట ఆరంభం.. మేమంతా కలుస్తాం.. భాజపాను గద్దె దించుతాం'

అమిత్​ షా టూర్​లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్​చల్.. చివరకు..

ABOUT THE AUTHOR

...view details