లండన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్‌కు చెందిన పలు యూనివర్సిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాయి. సంస్థాగత పరిశోధన విభాగం (సీపీఎఫ్)లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ప్రపంచంలోనే అగ్రగామి విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఈ విభాగంలో ఐఐటీ గువాహటి 41వ స్థానంలో నిలిచింది.
అయితే పూర్తి స్థాయి ర్యాంకింగ్‌లో మాత్రం భారత్‌లోని విశ్వవిద్యాలయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రపంచంలోని టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో గతంలో కంటే 4 ర్యాంకులు దిగజారి ఐఐటీ-బాంబే 177 ర్యాంకుకు పడిపోయింది. ఐఐటీ దిల్లీ 193వ స్థానంలో నిలిచింది.