పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు మూడు రూపాయలు తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తగ్గిన విద్యుత్ ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు.
ఒక్కో యూనిట్ ధరను రూ.3 తగ్గించినట్లు సీఎం పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అతి తక్కువ విద్యుత్ ఛార్జీలు ఉన్న రాష్ట్రంగా పంజాబ్ మారిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఛార్జీలు అమలవుతాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 69లక్షల గ్రామీణ కుటుంబాలు లాభపడతాయని వివరించారు.