తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం- పాక్​ నుంచే!

భారత్​- పాకిస్థాన్​ అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారీగా హెరాయిన్​ను (Heroin Seized) స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ సుమారు 34 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. వీటికి సంబంధించి మూలాలు పాకిస్థాన్​లో ఉన్నట్లు తెలిపారు.

Punjab Police seizes 6.73 kg heroin from fields near international border
భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం

By

Published : Oct 16, 2021, 2:55 PM IST

పంజాబ్​ పోలీసులు ఓ డ్రగ్​ ముఠా గుట్టురట్టు చేశారు. మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ స్మగ్లర్ నుంచి 6.73 కిలోల హెరాయిన్​ను (Heroin Seized) పట్టుకున్నారు. దీని విలువ సుమారు 34కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని పొలాల్లో ఈ డ్రగ్స్​ను గుర్తించినట్లు ఫిరోజ్​పుర్​ యాంటీ నార్కోటిక్స్​ అధికారులు తెలిపారు.

నిందితుడ్ని ఫిరోజ్​బాద్​లోని నౌరంగ్​ కీ సెయిల్​ గ్రామానికి చెందిన దిదార్​ సింగ్​గా గుర్తించారు. తొలుత నిందితుడి నుంచి 120 గ్రాముల హెరాయిన్​ను స్వాధీనం (Heroin Seized) చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం దర్యాప్తు చేయగా.. అతనికి పాకిస్థాన్​కు చెందిన మాదకద్రవ్యాల స్మగ్లర్​లతో సంబంధాలు ఉన్నట్లు కనిపెట్టారు. అక్కడ నుంచి డ్రగ్స్​ తరచూ తీసుకొచ్చే వారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో సెర్చ్​ ఆపరేషన్​ను ప్రారంభించిన అధికారులు భారత్​- పాక్​ అంతర్జాతీయ సరిహద్దుల్లోని పొలాల్లో దాదాపు 6.7 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:సింఘు సరిహద్దులో 'హత్య'పై మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details