తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంకు​ క్లర్క్​కు జాక్​పాట్​​.. లాటరీలో రూ.కోటి.. టికెట్​ తీసుకున్న గంటకే!

Punjab Man Wins Lottery : ఒక గంట వ్యవధిలో ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. లాటరీ టికెట్​ కొన్న గంటలోనే రూ.కోటి బంపర్​ ప్రైజ్ అతడిని వరించింది. అయితే తన అలవాటే తనను ఇలా కోటీశ్వరుడిని చేసిందని ఆ వ్యక్తి తెలిపాడు. అతడు ఎవరు? గంటలోనే ఎలా కోటీశ్వరడయ్యాడు?

Punjab Man Wins Lottery
Punjab Man Wins Lottery

By

Published : Jul 16, 2023, 11:24 AM IST

Updated : Jul 16, 2023, 11:32 AM IST

Punjab Man Wins Lottery : పంజాబ్​లోని గురుదాస్​పుర్ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి గంట వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. లాటరీ టికెట్​ కొన్న గంటలోనే అతడిని రూ.కోటి బంపర్​ ప్రైజ్​ వరించింది. అలవాటుగా గత సంవత్సరం నుంచి లాటరీ టికెట్లు కొంటున్నా ఎప్పుడూ తగల్లేదు. కానీ ఈసారి మాత్రం గంటలోనే లాటరీ గెలవడంపై అతడు సంతోషం వ్యక్తం చేశాడు.

లాటరీ టికెట్​తో రూపిందర్​జిత్​ సింగ్

ఇదీ జరిగింది..
Nagaland State Lottery Result : గురుదాస్​పుర్​ జిల్లా డేరా బాబా నానక్​ టౌన్​కు చెందిన రూపీందర్​జిత్​ సింగ్​.. అగ్రికల్చర్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​లో క్లర్క్​గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా రూ.6 చొప్పున నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అనంతరం బ్యాంకులో తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒక గంట సమయం తర్వాత.. 'మీరు రూ.కోటి గెలుచుకున్నారు' అని రూపీందర్​జిత్​కు లాటరీ ఏజెంట్​ నుంచి ఫోన్​ వచ్చింది. దీంతో ఒక గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. అయితే తన అలవాటే తనను ఇలా కోటీశ్వరుడిని చేసిందని రూపీందర్​జిత్​ తెలిపాడు.

రూ.కోటి లాటరీ టికెట్​

రూపీందర్​జిత్​ రూ.కోటి లాటరీ గెలవడం వల్ల బ్యాంకు సిబ్బంది అతడికి అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులు, బంధువులకు, స్నేహితులూ అభినందనలు తెలుపుతూ ఫోన్​ కాల్స్​ చేశారు. ఇదంతా చూస్తుంటే తన కల నిజమైనట్లు ఉందని రూపీందర్​జిత్​ అన్నాడు. తాను గెలిచిన రూ. కోటిని తన పిల్లలు, కుటుంబం భవిష్యత్​ కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. అవసరం ఉన్న పేద ప్రజలకు కూడా సహాయం చేస్తానని అన్నాడు. అయితే, రూపీందర్​ లాటరీ బంపర్ ప్రైజ్ గెలవడం వల్ల.. డేరా బాబా నానక్​ టౌన్​ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం యజమాని రూ.2.5 కోట్ల లాటరీ బంపర్​ ప్రైజ్​ను గెలిచాడు.

రూ. 44 కోట్ల లాటరీ.. ప్రాంక్​ అనుకుని నంబర్​ బ్లాక్​..
కర్ణాటకకు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వటక్కే కొరోత్ అనే వ్యక్తిని ఈ ఏడాది ఏప్రిల్​లో అదృష్టం వరించింది. ఒక్క రోజులోనే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. ఆన్​లైన్​లో కొనుగోలు చేసిన టికెట్​తో.. ఏకంగా రూ.44 కోట్లు గెలుచుకున్నారు. అయితే అరుణ్​ కుమార్​కు లాటరీ గెలుచుకున్నారని ఫోన్​ వస్తే దాన్ని ఆయన ప్రాంక్ కాల్ అనుకుని ఆ నంబర్​ను బ్లాక్​ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Jul 16, 2023, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details