Three Feet Tractor: పంజాబ్‌లో ఓ ఇంటర్ విద్యార్థి అతి చిన్న ట్రాక్టర్‌ను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బఠిండాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన గుర్విందర్ అనే యువకుడు మూడు అడుగుల ఎత్తు ఉన్న ట్రాక్టర్‌ను తయారు చేశాడు. అనంతరం సాధారణ ట్రాక్టర్ వలే దాన్ని నడిపి స్థానికుల మన్ననలను పొందాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న గుర్విందర్‌కు చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి. ఆ ఇష్టంతోనే చిన్న చిన్న మోటర్లను ఉపయోగించి ఇప్పటికే చాలా ట్రాక్టర్లను తయారు చేసినట్లు యువకుడు తెలిపాడు. ఈ క్రమంలోనే 3 అడుగుల ట్రాక్టర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నాడు.
"కొవిడ్ లాక్డౌన్ సమయంలో కేవలం రూ.40 వేలతో ఈ ట్రాక్టర్‌ను తయారు చేశాను. నేను రూపొందించిన ట్రాక్టర్ లీటరుకు 35 కి.మీ మైలేజీ ఇస్తుంది. 4 క్వింటాళ్ల వరకు బరువును మోయగలదు. ట్రాక్టర్‌పై బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఫొటోలు దిగుతున్నారు"
- గుర్విందర్