Covid boosters lead to positive HIV test?: కొవిడ్ టీకా బూస్టర్ డోసులకు, హెచ్ఐవీకి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. బూస్టర్ డోసులు హెచ్ఐవీకి దారితీస్తాయని కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన వైద్య నిపుణులు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ఇది వాస్తవం అనేలా శాస్త్రీయ ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు పీటీఐ ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
నోబెల్ గ్రహీత మృతితో..
Montagnier: 2008లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని మరో ఇద్దరితో కలిసి అందుకున్నారు మోంటెగ్నియర్. ఎయిడ్స్‌కు కారణమయ్యే హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్‌పై (హెచ్ఐవీ) పరిశోధనలకుగానూ ఆయనను సంయుక్తంగా ఈ అవార్డు వరించింది. అయితే.. మోంటెగ్నియర్ ఇటీవల మరణించారు.
అప్పటినుంచి ట్విట్టర్ వినియోగదారులు సహా ఇతర నెటిజన్లు ఆయనను కోట్ చేస్తూ.. కొన్ని పోస్ట్‌లు చేస్తున్నారు.
HIV infection: 'కొవిడ్ మూడో డోసు తీసుకున్నవారు.. ఎయిడ్స్ టెస్టు చేయించుకోండి. ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అప్పుడు మీరు మీ ప్రభుత్వంపై దావా వేయండి.'.. ఇది వాటి సారాంశం.
ఇలాంటివి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..?