Protests Across State on Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం అట్టుడికింది. అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం వేధిస్తోందని.. తెలుగుదేశం ఆగ్రహించింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, నందిగాంలో టీడీపీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. నరసన్నపేటలో పాత జాతీయ రహదారిపై కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు.. కూన రవికుమార్, గుండా లక్ష్మీదేవితో పాటు మరికొందరిని ఎచ్చెర్ల ఏఆర్ కార్యాలయంలో గృహనిర్బంధం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని మండిపడ్డారు. చీపురుపల్లిలో టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. విశాఖ పెందుర్తి కూడలిలో నేతలు ధర్నాకు దిగారు.
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ధర్నా చేస్తున్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును బలవంతంగా అరెస్టు చేశారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు భీమవరంలోని ఆయన స్వగృహంలో 24 గంటల దీక్ష చేపట్టారు. మండపేటలో ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను తాళ్లరేవు మండలం కోరంగిలో అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దెందులూరులో జాతీయ రహదారిపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు