తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ సీఎంకు ఖలిస్థానీ సంస్థ బెదిరింపులు - యోగి ఆదిత్యనాథ్ బెదిరింపులు

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ఖలిస్థానీ అనుకూల సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. త్రివర్ణ పతాకం ఎగురవేసేందుకు యోగిని అనుమతించేది లేదంటూ ఆడియో సందేశం వచ్చింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Pro-Khalistani Pannun threatens UP CM via audio message
యూపీ సీఎంకు ఖలిస్థానీ సంస్థ బెదిరింపులు

By

Published : Aug 7, 2021, 3:32 PM IST

స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకం ఎగరేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​(UP CM Yogi Adityanath)ను అనుమతించేది లేదంటూ ఖలిస్థానీ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(Sikhs for Justice) హెచ్చరికలు చేసింది. ఈ మేరకు 59 సెకన్ల నిడివితో ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ నెంబర్ నుంచి వచ్చిన ఈ మెసేజ్​ను యూపీ పోలీసులు గుర్తించారు. సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గుర్​పట్వంత్ సింగ్ పన్నుమ్(Gurpatwant Singh Pannun) ఈ బెదిరింపు సందేశం పంపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

"భాజపా, ఆరెస్సెస్, ప్రధాని మోదీ.. రైతులకు వ్యతిరేకం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వారికి మద్దతు ఇస్తున్నారు. యూపీ ప్రజలు, రైతులు.. రాష్ట్ర ప్రభుత్వం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలి."

-ఆడియోలోని వ్యాఖ్యలు

అంతేకాకుండా.. ఉత్తర్​ప్రదేశ్​ పశ్చిమాన ఉన్న సహరాన్​పుర్ నుంచి రాంపుర్​ వరకు ప్రాంతాన్ని ఖలిస్థానీలు తమ హస్తగతం చేసుకుంటారని ఆడియోలో పేర్కొన్నట్లు సమాచారం. తాండ, హర్దువాగంజ్, పంకి, పరిచ్ఛా సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థర్మల్ ప్లాంట్లు నిలిచిపోయేలా చేస్తానని గుర్​పట్వంత్ హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు

ఆడియో గురించి దిల్లీ నుంచి సమాచారం అందిందని లఖ్​నవూ పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే లఖ్​నవూలో కేసు నమోదు చేయలేదని వివరించారు.

ఆగస్టు 3న ఇదే తరహా బెదిరింపులు హిమాచల్​ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్​కూ వచ్చాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జాతీయ జెండా ఎగరేయకుండా చూస్తామంటూ బెదిరింపులు వచ్చాయని సీఎం ఠాకూర్ స్వయంగా వెల్లడించారు. పలువురు జర్నలిస్టులు, విపక్ష నేతలకూ ఇలాంటి వార్నిగ్​లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:వరదల ధాటికి కుప్పకూలిన రెండంతస్తుల భవనం

ABOUT THE AUTHOR

...view details