బంగాల్లో భవానీపుర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు టీఎంసీ అభ్యర్థిగా సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్ను తిరస్కరించాలని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ కోరారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. మమత సమర్పించిన అఫిడవిట్లో ఆమెపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపించారు. ఈ కేసులకు సంబంధించి మీడియా నివేదికలను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని, అలా చేయనందున మమత నామినేషన్ చెల్లుబాటు కాదని వివరించారు.
దీదీ నామినేషన్ తిరస్కరించాలని ప్రియాంక డిమాండ్ - మమతా బెనర్జీ వార్తలు
బంగాల్ భవానీపుర్ ఉప ఎన్నికకు(Bhabanipur By Election) సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్ను తిరస్కరించాలని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆమె సమర్పించిన అఫిడవిట్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి చేప్పలేదని ఆరోపించారు.
ప్రియాంక
భవానీపుర్ ఉప ఎన్నికకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 3న ఫలితం వెలువడనుంది.
ఇదీ చదవండి:Bhabanipur Election: దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు