తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరీక్షల భయం పోగొట్టడంపై మోదీ కొత్త పుస్తకం

పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని జయించడానికి పరిష్కారాల్ని సూచిస్తూ ప్రధాని మోదీ 'ఎగ్జామ్​ వారియర్స్'​ అనే పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన లేటెస్ట్​ ఎడిషన్​(తాజా సంచిక) ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని పెంగ్విన్ రాండమ్​ బుక్​ హౌస్​ తెలిపింది.

Prime Minister Narendra Modi's updated 'Exam Warriors' to hit stands soon
మోదీ 'ఎగ్జామ్​ వారియర్స్​' లేటెస్ట్​ ఎడిషన్​ వచ్చేది ఈ నెలలోనే!

By

Published : Mar 5, 2021, 3:48 PM IST

పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు విద్యార్థులు ఏం చేయాలో చెబుతూ 2018లో 'ఎగ్జామ్​ వారియర్స్​' అనే పుస్తకాన్ని రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. దానికి సంబంధించిన అప్​డేటెడ్​ వర్షన్​(తాజా సంచిక) ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని పెంగ్విన్​ రాండమ్​ హౌస్ ఇండియా ప్రకటించింది.

ఈ తాజా సంచికలో తరగతి లోపల, వెలుపల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలున్నాయని పబ్లిషర్స్​ తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు తనను తాను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిపే సూత్రాలతో పాటు, తోటి విద్యార్థులతో పోటీ పడే తత్వాన్ని అలవరచుకునే విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు సమయపాలను అలవరచుకోవడం, సాంకేతికతను ఉపయోగించడం, లక్ష్యాన్ని నిర్థేశించుకోవడానికి తగిన మార్గదర్శాకాలు విద్యార్థులకు ఈ అప్​డేటెడ్​ వర్షన్​ పుస్తకంలో ఉన్నాయని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇందులో ఉన్నాయని తెలిపారు.

విద్యార్థులు విద్యను ప్రభావవంతంగా నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన అనుభవసారాన్ని ఈ సంచిక ద్వారా ప్రధాని మోదీ అందించారని తెలిపింది.

ఇదీ చూడండి:'మోదీ పుస్తకాన్ని.. రాహుల్​కు అందజేస్తా'

ABOUT THE AUTHOR

...view details