తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఢాకాలో అమరవీరుల స్మారకం వద్ద మోదీ నివాళులు

modi arrives in bangladesh
ఢాకాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

By

Published : Mar 26, 2021, 9:32 AM IST

Updated : Mar 26, 2021, 1:17 PM IST

11:50 March 26

ఢాకాలో మోదీకి ప్రవాస భారతీయుల ఘనస్వాగతం

ఢాకాలోని హోటల్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్​లోని ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.  

దావూది బోహ్రా కమ్యూనిటీ..

ప్రధాని మోదీ రాకను స్వాగతించింది బంగ్లాదేశ్​లోని దావూది బోహ్రా కమ్యూనిటీ. 'పీఎం మోదీ మమ్మల్ని కలిశారు. బంగ్లాలోని సైదానా సాహిబ్​ పర్యటనను ప్రోత్సహించాలని కోరాం.' అని తెలిపారు దావూదీ బోహ్రా కమ్యూనిటీ ఆధ్యాత్మిక గురువులు. 

11:31 March 26

అమరులకు నివాళి

ఢాకా సావర్​లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద మోదీ నివాళులు అర్పించారు. అమరులను స్మరించుకున్న ప్రధాని స్మారకం వద్ద ఓ మొక్క నాటారు. 

10:42 March 26

మోదీకి ఘన స్వాగతం

  • బంగ్లాదేశ్: ఢాకా చేరుకున్న ప్రధాని మోదీ
  • మోదీకి స్వాగతం పలికిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
  • రెండ్రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
  • బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న మోదీ
  • బంగబంధు షేక్ ముజిబీర్ రెహ్మాన్ శత జయంతి వేడుకలకు హాజరు
  • తొలిరోజు సావర్‌లోని జాతీయ స్మారకం వద్ద మోదీ నివాళులు
  • షేక్ ముజిబీర్ రెహ్మాన్ శత జయంతి వేడుకల్లో పాల్గొననున్న మోదీ
  • బంగబంధు-బాపు మ్యూజియం ప్రారంభించనున్న షేక్ హసీనా, మోదీ
  • రెండో రోజు హిందూ ఆలయాలు సందర్శించనున్న మోదీ
  • రేపు శత్‌ఖిరా, గోపాల్‌గంజ్‌ ఆలయాల్లో పూజలు చేయనున్న మోదీ
  • వాణిజ్యం, నదుల నిర్వహణపై షేక్ హసీనాతో చర్చించనున్న మోదీ
  • భద్రత, సరిహద్దు అంశాలు, ఇరుదేశాల అనుసంధానంపై చర్చించనున్న మోదీ

10:20 March 26

ఘనస్వాగతం

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా మోదీకి ఘన స్వాగతం పలికారు. 

09:06 March 26

లైవ్: బంగ్లాదేశ్​ పర్యటనకు బయలుదేరిన మోదీ

కొవిడ్​ మహమ్మారి వ్యాప్తి తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పాటు బంగ్లాదేశ్​లోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. నేడు సావర్​లోని జాతీయ స్మారకం వద్ద నివాళులు అర్పిస్తారు మోదీ.   

బంగబంధు షేక్ ముజిబీర్ రెహ్మాన్ శత జయంతి వేడుకలకు హాజరుకావాలంటూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధాని మోదీని ఆహ్వానించారు.  

వాణిజ్యం, నదుల నిర్వహణ, భద్రత, సరిహద్దు అంశాలు, ఇరుదేశాల అనుసంధానంపై మోదీ చర్చించనున్నారు.  

Last Updated : Mar 26, 2021, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details