తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యాక్సినేషన్‌లో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వండి' - press information bureau

కరోనా టీకా పంపిణీలో పాత్రికేయులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రానికి ప్రెస్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. మహమ్మారితో పోరులో వారి సేవలు గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరింది.

Press Association seeks priority Covid-19 vaccination of accredited journalists
'కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వండి'

By

Published : Mar 5, 2021, 7:07 AM IST

కొవిడ్‌ మహమ్మారితో పోరులో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం కల్పించాలని ప్రెస్‌ అసోసియేషన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని గురువారంకోరింది. అక్రిడేటెడ్‌ జర్నలిస్టులను టీకా ప్రాధాన్య క్రమంలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు తమ ప్రతినిధులు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ను కలిసినట్లు ప్రెస్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు రైల్వే రాయితీలను పునరుద్ధరించాల్సిందిగా కూడా పీఐబీని కోరింది.

ఇదీ చూడండి:'డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్​ను తొలగించండి'

ABOUT THE AUTHOR

...view details